![]() |
![]() |

స్టార్ మా టీవీ లో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు' . ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -956 లో.. రిషిని ఎవరో ఇద్దరు ముసలివాళ్ళు కాపాడతారు. పసరు మందులతో రిషికి వైద్యం చేస్తుంటారు. అప్పుడే వసుధారతో గడిపిన జ్ఞాపకాలను రిషి గుర్తుకు చేసుకుంటు.. ఒక్కసారిగా వసుధార అంటూ గట్టిగా అరుస్తాడు. ఆ ముసలి ఆవిడ వచ్చి.. బాబు, లే అంటూ అడుగుతుంది. మళ్ళీ రిషి పడుకుంటాడు. వసుధార అంటున్నాడు. ఎవరై ఉంటారని ముసలి ఆవిడ భర్త అడుగుతాడు. ఇంకెవరు భార్య అయి ఉంటుంది లేకపోతే ప్రేమించిన అమ్మాయి అయి ఉంటుందని ముసలి ఆవిడ సమాధానం చెప్తుంది.
మరొకవైపు ముకుల్ కి మహేంద్ర ఫోన్ చేసి జరిగిందంత చెప్తాడు. కాసేపటికి శైలేంద్ర దగ్గరకి ఫణింద్ర దేవయాని వస్తారు. నీకు ఎండీగా రిషి వచ్చాక వసుధార బాధ్యతలు అప్పగిస్తానని చెప్పింది కానీ ఇప్పుడు నువ్వు అలోచించాల్సింది ఎండీ చైర్ గురించి కాదు రిషి గురించి.. రిషి కన్పించడం లేదని మహేంద్ర నీపై అనుమానంతో గన్ తో వచ్చాడు. ఆ అనుమానం అబద్ధం చెయ్యాలంటే నువ్వు రిషిని తీసుకుని రావలని ఫణింద్ర చెప్పగానే.. అయిన రిషి ఎక్కడ ఉన్నాడో నాకెలా తెలుసు డాడ్ అని శైలేంద్ర అంటాడు. తెలుసుకోవాలి.. తీసుకొని రావాలని ఫణింద్ర అంటాడు. ఇప్పుడు శైలేంద్ర ఈ ప్రాబ్లెమ్ నుండి ఎలా బయటపడుతాడని దేవయాని అనుకుంటుంది. మరొకవైపు జరుగుతున్న పరిస్థితుల గురించి మహేంద్ర ఆలోచిస్తూ.. జగతి ఫోటో పట్టుకొని ఎమోషనల్ అవుతుంటాడు. మరొకవైపు రిషి ఫోటో పట్టుకొని వసుధార.. మీరు క్షేమంగా ఉంటారని, త్వరలోనే వస్తారని అనుకుంటూ ఎమోషనల్ అవుతుంది. అదేసమయంలో అనుపమ జరుగుతున్న దాని గురించి ఆలోచిస్తుంటుంది.
మరుసటి రోజు ఉదయం శైలేంద్ర రౌడీని కలవడానికి వస్తాడు. శైలేంద్ర కలవడానికి వచ్చిన రౌడీ ఎవరో కాదు వసుధార, అనుపమలని సేవ్ చేసిన వ్యక్తి. నువ్వేనా భద్ర అంటే అని శైలేంద్ర అడుగుతాడు. అవునని ఆ రౌడీ చెప్తాడు. ఎందుకు వాళ్ళని వేసేయలేదని శైలేంద్ర అడుగుతాడు. ఇప్పటివరకు నేను వంద మార్డర్ లు చేసిన. నేను ఏమి చేసిన నాకు పని అప్పుజెప్పిన వాళ్ళకి ప్రాబ్లమ్ రాకుండా చేస్తాను. అందుకే ముందుగా వాళ్ళతో మంచిగా ఉన్నట్లు నటించి అనుమానం రాకుండా మర్డర్ చేస్తానని రౌడీ చెప్తాడు. అదేదో త్వరగా చెయ్ అని శైలేంద్ర చెప్తాడు. అ తర్వాత వసుధార, అనుపమలతో ఉన్నప్పుడు జరిగిన సంఘటన గురించి చెప్తాడు. ఆ అమ్మాయి భర్త రిషి అంట కదా? తనేమో అని హాస్పిటల్ కి పిలిచారా తను కాదట అంటూ ఈ బాడీ దగ్గర ఫోన్ దొరికిందని, ఆ ఫోటో చూపించగానే వీడు.. వీడు చచ్చిపోయాడంటే రిషి కచ్చితంగా పారిపోయాడని శైలేంద్ర మనసులో అనుకుంటాడు. అ తర్వాత రిషి ఫోటో చూపించి ఆ అమ్మాయితో పాటు ఇతన్ని కూడా వేసేయ్ అంటూ భద్ర అనే రౌడీకీ శైలేంద్ర చెప్తాడు. అతను సరే అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |